అబార్షన్ వల్ల యోని లూజ్ అవుతుందా..? సెక్సాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారు..?

by Bhoopathi Nagaiah |
అబార్షన్ వల్ల యోని లూజ్ అవుతుందా..? సెక్సాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారు..?
X

మా పెళ్లై సంవత్సరమయింది. మొదట్లో మా వైవాహిక జీవితం బాగానే ఉంది. గత నెలరోజులుగా మా వారు సెక్స్(Sex) ఆనందించలేకపోతున్నారు. దానికి కారణం నా యోని(vagina) చాలా లూజుగా ఉందని, అంగప్రవేశం (Penetration) త్వరగా జరుగుతోందని అంటున్నారు. దానివల్ల ఈ మధ్య దూరంగా ఉంటున్నారు. నాకే ఇలా ఉందా? అందరికీ ఇలాగే ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల మా ఇద్దరిమధ్య మనస్పర్థలు వస్తున్నాయి. పెళ్లయ్యాక రెండు సార్లు అబార్షన్ (Abortion) అయింది. దానివల్ల ఇలా అయిందా అనిపిస్తుంది. సెక్స్ విషయంలో నాకు బాగానే ఉన్నా, మా వారు మాత్రం యోని లూజు(vagina loose)గా ఉంటుందని అంటున్నారు. దయచేసి దీనికి పరిష్కారం తెలపండి.

నిత గారూ! కాన్పు వలన, అబార్షన్ల వలన యోని వదులు కాదు. కేవలం శృంగార సమయంలో యోనిలో స్రవించే ద్రవాలన వలనే ఇలా అనిపిస్తుంది. పైగా శృంగారంలో ఉద్రేకం చెందినప్పుడు స్త్రీతోపాటు పురుషుడికీ ఉద్రేకం కలిగి అంగం నుంచి స్రావాలు స్రవించడం వలన ల్యూబ్రికేషన్ (Lubrication)పెరిగి వదులుగా అవుతుంది. ఈ స్థితికి మీవారి పరిస్థితి కూడా కారణం. చేయవల్సిందల్లా మంచి తడిని పీల్చే కాటన్ గుడ్డతో తుడిచేస్తూ మళ్లీ శృంగారంలో పాల్గొనడమే! మీ భర్తని లేనిపోని అనుమానాలతో మిమ్మల్ని వేధించడం మానేసి మంచి సెక్సాలజిస్ట్‌(Sexologist)ను కలవమని చెప్పండి. శృంగార సమయంలో ఉద్రేకం కలిగి భార్యాభర్తలిద్దరిలోనూ శృంగార గ్రంథుల ద్వారా స్రావాలు స్రవించడం చాలా సహజం, ఆరోగ్యకరం కూడా! ఈ ఉత్తరం మీ భర్తతో చదివించండి. వీలైతే, లేడీ సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్ళి నాన్ సర్జికల్ వెజైనల్ టైటనింగ్ థెరపీ (Non-surgical vaginal tightening therapy) చేయించుకోండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story