thangalaan: ఓటీటీలోకి సూపర్ హిట్ ‘తంగలాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |
thangalaan: ఓటీటీలోకి సూపర్ హిట్ ‘తంగలాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో వచ్చిన సినిమా ‘తంగలాన్’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీలో పార్వతి, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే పశుపతి కీలక పాత్రలో నటించగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే తంగలాన్ భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ తంగలాన్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. పలు థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ చిత్రబృందానికి లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తంగలాన్ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. అయితే తంగలాన్ సెప్టెంబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో రానున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Advertisement

Next Story