- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2 OTT: అప్పుడే ఓటీటీలోకి పుష్ప-2.. ప్రీమియర్ డేట్ కూడా ఫిక్స్!
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ (Positive Talk) సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ‘పుష్ప-2’ హడావిడి థియేటర్లలో కొనసాగుతూనే ఉండగా.. తాజాగా ఈ మూవీ ఓటీటీ (OTT)కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని తెలుస్తుండగా.. 2025 జనవరి 9న నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్టింట ఓ వార్త హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.