- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
ఓటీటీలోకి రాబోతున్న హీరో సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అహం రీబూట్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
![ఓటీటీలోకి రాబోతున్న హీరో సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అహం రీబూట్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు ఓటీటీలోకి రాబోతున్న హీరో సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘అహం రీబూట్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347209-sumanth.webp)
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రేక్షకుల కూడా ఓటీటీలో వచ్చే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. థియేటర్స్‌కు వెళ్లకుండా ఓటీటీ సంస్థలకు డబ్బులు చెల్లించి మరీ స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో డిజాస్టర్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుని రికార్డులు సృష్టిస్తున్నాయంటేనే ఓటీటీ ఎంతలా ఆదరణ పొందిందో అర్థం అవుతోంది.
అయితే కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా మంచి స్పందన రాబడుతుండటంతో స్టార్ హీరోలు కూడా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, అక్కినేని హీరో సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. సాగర్ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన అహం రీబూట్ మూవీ జూన్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల అయింది. అయితే ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.