ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Hamsa |
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: గత కొన్ని రోజుల నుంచి ఓటీటీలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినప్పటికీ నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా, ఓ హాలీవుడ్ హారర్ మూవీ మాత్రం ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే.. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘ఈవిల్ డెడ్ రైజ్’ గత ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా రూ. 147 కోట్ల వసూలు చేసి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఈ హారర్ థ్రిల్లర్ సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. తాజాగా, ‘ఈవిల్ డెడ్ రైజ్’ మూవీ సెప్టెంబర్ 21న సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

Next Story

Most Viewed