ఏడాది తర్వాత భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. ఎందులో చూడొచ్చంటే?

by Hamsa |
ఏడాది తర్వాత భయపెట్టేందుకు ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ నాలుగు వారాల్లోని ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కొన్ని చిత్రాలు థియేటర్స్‌లో మెప్పించలేనప్పటికీ ఓటీటీలో సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజుల నుంచి ఓటీటీలో మలయాళ సినిమాలు భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా, ఓటీటీలోకి ఓ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది ఏప్రిల్ 20న ‘నీల వెలిచం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆషిక్ అబు తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో టోవినో థామస్‌తో పాటు రిమా కల్లింగల్, రోషన్, షైన్ టామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే రాజేశ్ మాధవన్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్, చెంబన్ వినోద్ జోస్, వెలియనాడ్ తదితరులు కూడా నటించారు. అయితే ఈ హారర్ థ్రిల్లర్‌ను తెలుగులో ‘భార్గవి నిలయం’ పేరుతో తీసుకువచ్చారు. తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

Next Story