30 శాతం మంది నగరాలకు వలస వెళ్తున్నారు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
30 శాతం మంది నగరాలకు వలస వెళ్తున్నారు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్లలో భారత దేశ చరిత్రలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధిని చేసి చూపించామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం గడ్కరీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి మోడీ నాయకత్వమే సరైందని చెప్పారు. ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పల్లెల నుంచి 30 శాతం మంది వలస వెళ్తున్నారని అన్నారు. ధాన్యం, పంచదార, జొన్నలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి కోసం రూ.లక్షల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.

నదుల అనుసంధానం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. వీలున్న ప్రతి చోటా నీటిని సంరక్షించుకోవాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 90 శాతం ప్రజలు పల్లెల్లోనే ఉండేవారని.. ఇప్పుడు 30 శాతం మంది కుటుంబాలను పోషించుకోలేక నగరాలకు వలస వెళ్లా్ల్సిన పరిస్థితులు వచ్చారని అన్నారు. దీంతో సాగు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని తెలిపారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఏపీ వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని చెప్పారు.

Advertisement

Next Story