AP 2024 Election Results: వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!

by Indraja |
AP 2024 Election Results: వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!
X

దిశ వెబ్ డెస్క్: నేడు దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని్కల పలితాలు చూస్తే.. గత ఎన్నికల్లో 151 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే 2024 ఎన్ని్కలకు సంబంధించిన ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. అయితే గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూడడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్షేమ పథకాలు ఫుల్లు.. అభివృద్ది నిల్లు..

2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చి్ంది. దీనితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే జగన్ సీఎం అయిన తరువాత రాష్టంలో సంక్షేమ పథకాలపైనే దృష్టిసారించారు. రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదనే చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు. సీఎంగా జగన్ హయాంలో ఒక్కటి కూడా కొత్త కంపెనీ రాలేదు. అలానే జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. దీనితో నిరుద్యోగం పెరిగింది. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూపుదాల్చని హామీలు..

2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో తాను అధికారంలోకి వస్తే, పూర్తిగా మధ్యపానాన్ని నిషేధిస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, అంగన్‌వాడీలకు జీతం తెలంగాణ అంగన్‌వాడీలకంటే ఎక్కవ ఇస్తానని, ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తానని ఇలా చాలానే హామీలు ఇచ్చారు. అయితే వీటిలో కొన్నింటిని సగంసగం పూర్తి చేస్తే, కొన్నింటిని అసలు చెయ్యలేదు.

ఉదాహరణకు ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాకా కేవలం ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్‌కి వెళ్లినా వాళ్లలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. పూర్తిగా మధ్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాకా పూర్తి మధ్యపాన నిషేధం హామీని అమలు చేయక పోగా రాష్ట్రాన్ని మధ్యపానానికి చిరునామాగా మార్చేశారు.

ఉద్యోగులు, నిరుద్యోగుల తిరుగుబాటు..

కొందరికి జీతాలు పెంచుతామని చెప్పి పెంచలేదు, మరికొందరికి అసలు జీతాలే ఇవ్వలేదు, న్యాయం కోసం శాంతియుతంగా దర్నాకు దిగిన ఉద్యోగులపై అధికార జులం ప్రదర్శి్ంచారు. మహిళలు అనే ఇంకితం లేకుండా దాడి చేశారు, నిరుధ్యోగులకు ఉధ్యోగాలు ఇవ్యలేదు. దీనితో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వైసీపీపై వ్యతిరేకత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంతి.

కొంపముంచిన మూడు రాజధానులు..

టీడీపీ హయాంలో పునాది వేసుకున్న అమరావతిని వైసీపీ అధికారంలోకి రాగానే

సీఎం జగన్ పక్కపెట్టారు. మూడు రాజధానుల ప్రస్తావన లేవనెత్తారు. అయితే మూడు రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేదు. దీనితో ఆంధ్రాకు అటు అమరావతి, ఇటు మూడురాజధానులు ఏదీలేక దశాబ్ద కాలం గడుస్తున్నా నేటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, అందుకు కారణం వైసీపీనే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుంది.

చిరాకుపెట్టిన వైసీపీ నేతల తీరు..

అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తరువాత నేతల నడవడిక మారాలి, ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజాసమస్యలపైన చర్చించాలి, కాని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోపాటు చివరికి ముఖ్యమంత్రి సైతం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి, బూతులు మాట్లాడడం, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే మాట్లాడడం ప్రజల్లో అసహనాన్ని రేకేత్తించింది.

అలానే స్థానిక నేతలు దోచుకో దాచుకో అనే నినాధంతో ముందుకు వెళ్లారు. స్థానిక ప్రజల సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇసుక కుభకోణం, భూకబ్జాలు, ఇలా పలు అక్రమాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలు రౌడీఇజానికి పోలింగ్ రోజు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు అధ్దంపడుతున్నాయి.

వైసీపీకి విద్యార్థుల్లో వ్యతిరేకత..

సీఎం జగన్ అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ తీసేశారు. అదికూడా ఎంట్రన్స్ రాసి, అంధులో ఉత్తీర్ణత సాదించి, ఇక ఏ విధ్యాసంస్థలో సీటు వస్తుందా అని విధ్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం ఎందరో విధ్యార్థుల పీజీ కలను కలగానే మిగిల్చింది. అలానే రియంబర్స్మెంట్‌కు అర్హులైన డిగ్రీ విద్యార్థులకు సైతం సకాలంలో రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, దీనితో విధ్యార్థులు ఇబ్బంధులకు గురైయ్యారు.

నేతల మార్పులు, చేర్పులు..

జగన్ ఐప్యాక్‌ను పూర్తిగా నమ్మారు. దీనితో ఐప్యాక్‌ ఆధారంగా నేతలను నియోజకవర్గాలు మార్చారు. అలా తమ నియోజకవర్గాన్ని వదిలి మరో చోటుకు వెళ్లడం ఇష్టంలేని నేతలు పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఇక స్థానాలు మార్చిన నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని సాధించలేకపోయారు.

వర్కౌట్ కాని సింపతి.. శతృవుగా మారిన చెల్లెల్లు..

గత ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో సైతం జగన్ సింపతి ఓట్ల కోసం ట్రై చేశారని తెలుస్తోంది, గీతాంజలి మరణం, జగన్‌పై రాళ్ల దాడితో ప్రజల్లో సింపతీ సంపాదించుకోవాలి అని అనుకున్న అది వర్కౌ్ట్ కాలేదు. ఇక సొంత చెల్లెల్లు షర్మిల, సునీత అన్నను ఏకిపారేసిక విషయం తెలిసిందే. పై కారణాల చేత వైసీపీ ఒడిపోయినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed