తెలంగాణ రాజకీయ పార్టీలకు CEO వికాస్ రాజ్ వార్నింగ్

by GSrikanth |
తెలంగాణ రాజకీయ పార్టీలకు CEO వికాస్ రాజ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల ప్రచార ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని అన్నారు. 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఇస్తామని తెలిపారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల కోసం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని భావించారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని అన్నారు. ఇప్పటికే ఎలాంటి పత్రాలు లేని, అనుమతులు లేకుండా తరలిస్తున్న వంద కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story