MP ఎన్నికల్లో ఐదుసార్లు ఓడిపోవడానికి కారణం అదే.. తమిళిసై కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
MP ఎన్నికల్లో ఐదుసార్లు ఓడిపోవడానికి కారణం అదే.. తమిళిసై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాను పోటీ చేస్తున్న దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. డబ్బులు లేకనే ఐదుసార్లు పోటీ చేసినా ఓడిపోయానని చెప్పారు. కానీ, ఈ సారి అలా ఉండదని అన్నారు. ఆరోసారి గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తానని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గెలవబోయే 400 సీట్లలో తనది కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా తమిళిసై సౌందరరాజన్ మార్చి 26న నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19న ఆమోదించారు. ఈ నెల 20న తమిళిసై సౌందర రాజన్ బీజేపీలో చేరారు. మరోవైపు డబ్బులు లేకపోవడంతోనే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Advertisement

Next Story