- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్‌ను కలిసి ఆ టికెట్ ఇవ్వాలని కోరా: వీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్‌సభ సీటు కావాలని కోరినట్లు తెలిపారు. ఖమ్మం టికెట్ నాకు ఇస్తే మెజార్టీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో ప్రజలు తెలియాలని అన్నారు.
ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందని తెలిపారు. గతంలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం పేదల భూములు లాక్కున్నారని గుర్తుచేశారు. మొత్తం రూ.2500 కోట్ల ఆస్తులు, భూములు లాక్కున్నారని అన్నారు. నయీం మరణం తర్వాత అవన్నీ ఏమయ్యాయి అని అడిగారు. ఒక్క అంశాన్ని కూడా వదలకుండా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.