తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీరే

by Disha Web Desk 12 |
తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీరే
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మొదటి దశలో 102 స్థానాలకు పోలింగ్ జరగ్గా ఈ నెల 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడత లో మే 13 పోలింగ్ జరగనుండగా.. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. వారి అపిడవిట్ ఆధారంగా అభ్యర్థులు ఆస్తుల విలువలను చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు అత్యంత ధనిక అభ్యర్థులుగా నిలిచారు.

వీరిలో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5,598.65 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లోనే రిచెస్ట్ అభ్యర్థిగా నిలిచారు. అలాగే చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ. 4, 568 కోట్లతో రెండో స్థానంలో, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 715.62 కోట్లతో మూడో స్థానంలో కడప కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల రూ. 182 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఈ రోజు మరికొందరు కీలక నేతలు నామినేషన్లు వేయనుండగా వారిలో ఎవరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయో తేలనుంది.



Next Story

Most Viewed