బీఆర్ఎస్‌కు సహకరించి ఉద్యోగాలు కోల్పోవద్దు.. అధికారులకు రఘునందన్ స్వీట్ వార్నింగ్

by GSrikanth |
బీఆర్ఎస్‌కు సహకరించి ఉద్యోగాలు కోల్పోవద్దు.. అధికారులకు రఘునందన్ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్రామిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులతో అక్రమంగా సమావేశం నిర్వహించారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి సమావేశంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదుపై పోలీసులకు సకాలంలో స్పందించలేదు.. కానీ, నేను ఫిర్యాదు చేసినట్లు వెంకట్రామిరెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు పనుల్లో ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని హితవు పలికారు. ఎన్నికల వేళ ఉద్యోగాలను రిస్క్‌లో పెట్టుకోవద్దని సూచించారు. న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed