- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా 5 లక్షల ఓట్లు ఏమయ్యాయి.. వారిపై కేసులు పెడతా అంటూ కేఏ పాల్ సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రితో పాటు కేవలం 22 మంది కుటుంబ సభ్యులు ఓటు వేస్తే తనకు కేవలం నాలుగు ఓట్లే పడ్డాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. తనకు ఐదు లక్షల ఓట్లు పడాల్సి ఉందని.. ఆ ఓట్లు ఎటు పోయాయో.. ఏం చేశారో తెలియట్లేదని అన్నారు. నా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా నా ఖాతాలో లేవని ఆవేదన చెందారు. ఇవి దరిద్రపు ఎన్నికలు అని కొట్టిపారేశారు. అంతేకాదు.. తనకు ఎనిమిది చోట్ల సున్నా ఓట్లు పడ్డాయని అన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తానని.. కౌంటింగ్ కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెడతానని.. చట్ట పరంగా శిక్ష పడేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కేఏ పాల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ ఎన్నికల్లో కేఏ పాల్ పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేశారు. ఒకరు అసెంబ్లీ, ఇంకొకరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు.