AP 2024 Election Results: పిఠాపురంలో జనసేన హవా.. ఆధిక్యంలో పవన్

by Indraja |
AP 2024 Election Results: పిఠాపురంలో జనసేన హవా.. ఆధిక్యంలో  పవన్
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠబరితంగా మారాయి. కాగా ప్రస్తుతం పిఠాపురంలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్‌ కౌంటింగ్‌లో జనసేన హవా కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటి చేసిన విషయం తెలిసిందే..

కాగా ఆయన తన ప్రత్యర్థి వంగా గీతాపై 1000 ఓట్ల మెజారిటీతో ముందజలో ఉన్నారని సమాచారం. ఇక పిఠాపురం పోస్టల్ బ్యాలెట్‌లో ఎక్కువ చెల్లని ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయినా పవన్ ముందజలో ఉండడంతో పవన్ గెలుపు ఖాయం అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed