పార్లమెంట్ ఫైట్: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా?

by GSrikanth |
పార్లమెంట్ ఫైట్: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 22 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తోంది. సుదీర్ఘ చర్చల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో పాటు సీట్లు విషయంలోనూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే కూటమిలో భాగంగా మూడు పార్టీలు దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన పవన్ కల్యాణ్.. ఈ సారి అలాంటి తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా దగ్గరుండి కూటమిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెంచారు.

ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు జనసేన సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అనూహ్యంగా తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏపీలో పోటీ చేస్తున్న జనసేన.. తెలంగాణలోనూ పొత్తులో భాగంగానే పోటీ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 7 స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. మరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ఖాతా ఓపెన్ చేస్తుందా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు 17 లోక్ సభ స్థానాలకుగాను ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed