- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. ఎమ్మెల్సీని బరిలోకి దింపిన కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోటీ నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి తప్పుకోవడంతో శంభీపూర్ రాజుకు అవకాశం ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే.. 30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ సెగ్మెంట్‌పై ప్రధాన పార్టీలు కన్నేశాయి.
ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. పక్కా వ్యూహంతో బీజేపీ ఈటల రాజేందర్‌ను అభ్యర్థిగా బరిలోకి దిపింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తా చాటిన బీఆర్ఎస్ కూడా మల్కాజ్‌గిరిపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి రంగంలోకి దింపింది.