కిషన్ రెడ్డి, ఈటలను కేంద్ర మంత్రులుగా చూస్తాం.. ప్రముఖ సినీ హీరో సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
కిషన్ రెడ్డి, ఈటలను కేంద్ర మంత్రులుగా చూస్తాం.. ప్రముఖ సినీ హీరో సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రులుగా చూస్తామని, కేంద్రంలో వారి అవసరం ఉంటే ఇద్దరూ కేంద్ర మంత్రులవుతారని మలయాళ హీరో, బీజేపీ నేత సురేశ్ గోపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా చేయడంపై తుది నిర్ణయం పార్టీ తీసుకుంటుందని, కానీ తాను మాత్రం వారు కేంద్రమంత్రులు కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకే తెలుగు ప్రజలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌ను గెలిపించాలని చేతులు జోడించి కోరారు.

వారితో పాటు మిగిలిన స్థానాల్లోనూ బీజేపీని బలపరచాలని కోరారు. కిషన్ రెడ్డి మళ్లీ కేంద్రమంత్రి అయితే ఎన్నో పనులు చేస్తారన్నారు. ఇకపోతే తాను పోటీ చేస్తున్న త్రిస్సూర్ లో ప్రజల దీవెనలు ఈవీఎం బాక్స్ లో నిక్షిప్తమై ఉందని, తనకు ప్రజలు సంబరాలు చేసుకునే ఆశీర్వాదం ఇచ్చారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళతో పాటు తెలంగాణలో కూడా బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed