మా చెల్లిని జైల్లో పెట్టిన పార్టీతో ఎందుకు కలుస్తాం.. బీజేపీపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్

by Disha Web Desk 2 |
మా చెల్లిని జైల్లో పెట్టిన పార్టీతో ఎందుకు కలుస్తాం.. బీజేపీపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు ఇంకా దేశంలో 13 ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని ఆ 13 పార్టీలే రేపు దేశాన్ని శాసించొచ్చు అని అన్నారు. బీజేపీ కలిసి పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు పట్టలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మా చెల్లి(కవిత)ని జైల్లో పెట్టిన పార్టీతో తామేందుకు కలుస్తామని ప్రశ్నించారు. పాలన అంటే బూతులు మాట్లాడటం కాదని రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. 6 నెలల్లో రాజకీయాలను మళ్లీ కేసీఆర్ శాసించే స్థాయికి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌కు ఒక జిల్లా ఉండాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు. మ‌రి 33 జిల్లాల్లో ఏ జిల్లాలు కొన‌సాగిస్తారు.. ఏ జిల్లాలు తొల‌గిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జ‌నాభా అవ‌స‌రాల‌కు అనుగుణంగా వికేంద్రీక‌ర‌ణ చేయాలి. ఇంకా కొత్త డివిజ‌న్లు, మండ‌లాలు మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed