BRS అభ్యర్థులకు ఈనెల 18న బీఫామ్‌ల అందజేత

by GSrikanth |
BRS అభ్యర్థులకు ఈనెల 18న బీఫామ్‌ల అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ఈనెల 18వ తేదీన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఫామ్‌లు అందజేయనున్నారు. అంతేగాకుండా.. ఎన్నికల ఖర్చుల నిమిత్తం అభ్యర్థులకు నియమావళిని అనుసరించి రూ.95 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారు. అనంతరం అదేరోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. ఆహ్వానితులందరికీ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాట్లుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యలాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపుఇవ్వనున్నారు. ప్రజలకు మరింత చేరుకావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

Next Story