- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే: KCR
దిశ, వెబ్‌డెస్క్: నా బస్సు యాత్రలో కాంగ్రెస్, బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం రామగుండంలో రోడ్‌షోను కేసీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయాయని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో కరెంట్ పోయిన దాఖలాలే లేవని అన్నారు. తాగునీటి సమస్య కూడా రాకుండా కంటికిరెప్పాల ప్రజలను కాపాడుకున్నామని చెప్పారు. పదేళ్లలో ఏనాడూ పంటలు ఎండిపోలేదని అన్నారు. ఇప్పుడు సడన్‌గా ఎందుకు రైతులకు కష్టాలు వచ్చాయి, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఆచితూచి ఓటు వేయాలని సూచించారు.
కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మరోవైపు మోడీ హయాంలో రూపాయి విలువ దిగజారిపోయిందని విమర్శించారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. మోడీ హయాంలో దేశం నాశనం అవుతోందని అన్నారు. మత విద్వేశాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదని.. విచక్షణతో ఓటు వేయాలని సూచించారు. కాగా, కేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం ముగిసింది. దీంతో రామగుండంలో రోడ్‌షోతో మళ్లీ కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు.