- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని పదేళ్లు పాలించిన బీజేపీ ప్రజలకు ఏం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సోమవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రశ్నించాలని ఓటర్లకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సామాన్యులు భరించలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. దేశంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం అన్నీ పెరిగాయని అన్నారు. జీఎస్టీ వేసి ధరలు పెంచిందని తెలిపారు. పెరిగిన ధరలతో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను బీజేపీ ప్రభుత్వం నిండా ముంచిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి చెప్పకోవడానికి పథకాలే లేవని విమర్శించారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అన్నారు.