యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారం షురూ.. గెలిచి పార్లమెంట్‌కు వెళ్తాడా?

by GSrikanth |
యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారం షురూ.. గెలిచి పార్లమెంట్‌కు వెళ్తాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011 వరల్డ్ కప్‌లో జట్టులో కీలక పాత్ర పోషించారు. జట్టుకు అనేక క్లిష్ట సమయంలో ఆదుకున్నారు. కొన్నిసార్లు ఒంటిచేత్తో విజయాలు అందించగా.. మరికొన్ని సార్లు చివరి వరకూ పోరాడి శభాష్ అనిపించుకున్నారు. ఇటీవలే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుండి బరిలో నిలిచారు.

ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన ఎక్కడి వెళ్లినా క్రికెట్ అభిమానులు భారీగా అక్కడకు చేరుకొని మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన బహరంపూర్ సెగ్మెంట్‌లో పాగా వేసేందుకు టీఎంసీ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దింపింది. యూసుఫ్ పఠాన్‌ను మొదటి నుంచి వ్యతిరేకించిన భరత్ పూర్ టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ పఠాన్‌కు ఘన స్వాగతం పలుకుతూ కనిపించడం విశేషం. మరి పఠాన్ గెలిచి పార్లమెంట్‌కు వెళ్తాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.

Advertisement

Next Story