- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.. ఎన్నికల అధికారి
దిశ,ప్రతినిధి నెల్లూరు: ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతరం అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ ఎం హరినారాయణన్ సూచించారు. గురువారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించేందకు వచ్చిన కలెక్టర్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన రిజిష్టరులో సంతకం చేసి, పోలీసు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు.
కౌంటింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని పరిశీలించారు. ఈ గ్యాలరీలో రాజకీయపార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియను వీక్షించేందుకు సీసీ టీవీలను ఏర్పాటుచేశారు. అలాగే 8 నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను మానిటరింగ్ చేసేందుకు మూడు షిప్టుల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.