కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా CM రేవంత్ రెడ్డిని ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొనాలని ఏడు రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా తమిళనాడు, బిహార్, గుజరాత్ నుంచి ఆహ్వానాలు రావడంతో అధిష్టానం రేవంత్ రెడ్డి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో నేషనల్ స్టార్ క్యాంపెయిన్‌ బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించడానికి సిద్ధమైంది. కాగా, ఇవాళ, రేపు కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న వయానాడ్ నియోజకవర్గంలో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. దాంతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తోన్న అలప్పజ నియోజకవర్గంలోనూ ప్రచారం చేయనున్నారు.

Next Story

Most Viewed