నిధులిచ్చే బాధ్య‌త నాది..కావ్య‌ను గెలిపించండి.. అభివృద్ధి ఎట్లుంట‌దో చూపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 23 |
నిధులిచ్చే బాధ్య‌త నాది..కావ్య‌ను గెలిపించండి.. అభివృద్ధి ఎట్లుంట‌దో చూపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న క‌డియం కావ్య‌ను గెలిపించే బాధ్య‌త ఈ ప్రాంత ప్ర‌జ‌లు, కాంగ్రెస్ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల‌దేన‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అటు ఇటు కాకుండా మంచి మెజార్టీ ఇస్తామ‌ని భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యేలు సైతం చెబుతున్నార‌ని అన్నారు. మీరు క‌డియం కావ్య‌ను గెలిపించే బాధ్య‌త తీసుకుంటే...వ‌రంగ‌ల్ ప్రాంతాన్ని, న‌గ‌రాన్ని అభివృద్ధి చేసేందుకు, వెంట‌వెంట‌నే నిధులు మంజూరు చేసేందుకు నాది బాధ్య‌త అంటూ స్ప‌ష్టం చేశారు.

రామ‌ప్ప డీబీఎం 38 నుంచి భూపాల‌ప‌ల్లి ప్రాంతానికి నీళ్లిప్పించే బాధ్య‌త నాది అంటూ స్థానిక ప్ర‌జ‌లు హామీ ఇచ్చారు.క‌డియం కావ్య‌ను క‌నీసం రెండు ల‌క్ష‌ల కంటే త‌క్కువ కాకుండా మెజార్టీ ఇవ్వాల‌ని ఈసంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రేవంత్ రెడ్డి కోరారు. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రేగొండ మండ‌ల‌కేంద్రంలో మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన జ‌న‌జాత‌ర బ‌హిరంగ స‌భకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.


ఈ ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్‌కు చిత్త‌శుద్ధి..

పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త‌ జయశంకర్ సార్ స్వ‌గ్రామం అక్కంపేట‌ను రెవెన్యూ విలేజ్‌గా మార్చ‌లేక‌పోయింద‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆ ప‌ని పూర్తి చేసింద‌ని అన్నారు. అభివృద్ధిపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్త‌శుద్ధి అలాంటిద‌ని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కార్యకర్తల బాద్యత తీరలేద‌ని, మీ బాధ్యత ఇంకా మిగిలే ఉంద‌ని, జరగబోయే ఫైనల్స్ లో మోదీని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగరేయాల‌న్నారు. వరంగల్ కు ఔటర్ రింగు రోడ్డు రాలేదు.. రావాల్సిన ఎయిర్ పోర్టును మోదీ అడ్డుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేస్తామ‌ని మోసం చేశార‌ని అన్నారు. కొట్లాడంగా కొట్లాండ‌గా గిరిజ‌న యూనివ‌ర్సిటీని ఇటీవ‌ల ఏర్పాటు చేశార‌ని అన్నారు. ప్ర‌జా హ‌క్కుల‌పై ప్ర‌శ్నించ‌నందుకు నాపై అక్రమ కేసులు పెట్టాలని బీజేపీ చూస్తోంద‌ని అన్నారు. వ‌రంగ‌ల్ బీజేపీ అభ్య‌ర్థిగా కేసీఆర్ త‌న శిష్యుడు, భూ క‌బ్జాకోరుడు.. అన‌కొండ అరూరి ర‌మేష్‌ను పంపించార‌నిఅన్నారు. అమాయ‌కుడిని బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పెట్టి బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లను కేసీఆర్ మోసం చేసి.. వారి ఆత్మ‌గౌర‌వాన‌ని తాక‌ట్టు పెడుతున్నాడ‌ని అన్నారు.


రెండో స‌భ‌తో మ‌రింత జోష్‌..!

వ‌రంగ‌ల్ పార్ల‌మెంట‌రీ స్థానం ప‌రిధిలో నిర్వ‌హించిన రెండో జ‌న‌జాత‌ర స‌భ స‌క్సెయింది. మ‌డికొండ‌లో ఏర్పాటు చేసిన మొద‌టి స‌భ‌లో, మంగ‌ళ‌వారం రేగొండ‌లో నిర్వ‌హించిన రెండో స‌భ‌లోనూ ముఖ్య‌మంత్రి వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా అభివృద్ధిపై హామీల వ‌ర్షం కురిపించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగా వినేందుకు ఎర్ర‌టి ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా పెద్ద సంఖ్య‌లో ప‌ర‌కాల‌, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపున‌కు కృషి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి వ‌రంగ‌ల్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నిర్వ‌హించిన రెండో స‌భ‌తో క్యాడ‌ర్‌లో మ‌రింత ఉత్సాహం నెల‌కొన్న‌ట్ల‌యింది.


Next Story

Most Viewed