దేశంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన రాష్ట్రమిదే: ECI

by GSrikanth |
దేశంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన రాష్ట్రమిదే: ECI
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు 7 దశల్లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఈ ఎన్నికలు ఏడు విడతలుగా కొనసాగి, జూన్ 1వ తేదీన ముగుస్తాయి. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తైంది. ఈ నాలుగు విడతల పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల్లో 69.16 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 80.66 శాతం, జమ్మూకాశ్మీర్‌లో అత్యల్పంగా 38.49 శాతం నమోదైందని వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుంది.



Next Story

Most Viewed