- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను.. భావోద్వేగానికి లోనైన KCR
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే పోరాడి తెలంగాణ సాధించానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సభకు సుల్తాన్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్ని జన్మలు ఎత్తినా మెదక్ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేను అని భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ నేతలను తొత్తులుగా మారిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు డ్యూటీ చేయాలి తప్పా.. అతి చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది కూడా ఈ ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు తెలిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్ల కంటే ఎక్కువ రావని అన్నారు. సర్వే రిపోర్ట్‌లు చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నారాయణపేట సభలో వణికిపోయారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో వారికే తెలియదని అందుకే రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని అన్నారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టమని.. దాన్ని వదులుకోవాలని చెప్పారు.