- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదు: బీజేపీ ఎంపీ
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ విడుదలవుతున్న ఏ సర్వే చూసినా బీజేపీ గాలి వీస్తోందని స్పష్టమవుతున్నాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బుధవారం నాంపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాబోతోందని అన్నారు. దాదాపు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా కాంగ్రెస్‌ను గౌరవించడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని స్వయంగా కూటమిలోని టీఎంసీ పార్టీ అధినేత మమతా అన్నారని గుర్తుచేశారు. తెలంగాణలోనూ నేల విడిచి సాము చేసేలా కాంగ్రెస్ నేతలు తీరు ఉందని అన్నారు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. కాంగ్రెస్ నేతల మధ్య పొసగడం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్‌ది, కాంగ్రెస్‌ది మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ అని తెలిపారు.