- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు నటుడు.. పోటీ చేసే నియోజకవర్గం ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఔర్ ఏక్ బార్.. మోడీ సర్కా్ర్ అనే నినాదంతో పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కుదుపుతోంది. ఈ క్రమంలోనే గెలిచే అవకాశం ఉన్న ఏ నియోకవర్గంలోనూ ఏమాత్రం అవకాశం తీసుకోకుండా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగు నటుడ్ని బరిలోకి దింపింది. రామాయణం సీరియల్‌లో శ్రీరాముడి పాత్ర పోషించి అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటుడు అరుణ్ గోవిల్‌ను పోటీలో పెట్టింది.
ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మీరట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు రెండు సామాజికవర్గాల నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో అధిష్టానం అనూహ్యంగా అరుణ్ గోవిల్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించింది. మరోవైపు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిత్ అగర్వాల్ సైతం మీరట్ టికెట్ ఆశించారు. కానీ, శ్రీరాముడి ప్రజల గుండెళ్లో స్థానం సంపాదించకున్న వ్యక్తికి సీటు కట్టబెట్టింది. ఇటీవల అయోధ్యలో రామాయలం ప్రారంభోత్సవం కూడా జరుగడంతో అరుణ్ గోవిల్ గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తోంది. తెలుగులో గోవిందా గోవిందా, ఏడుకొండల స్వామి చిత్రాల్లో ఆయన వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన మెప్పించారు.