- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై పని అయిపోయినట్లేనా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లె చాన్స్ ఉందా..?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ కైవసం చేసుకున్న ముంబై జట్టు ఈ సీజన్‌లో ఓటములతో సతమతమవుతుంది. 2024 లో మొత్తం 8 మ్యాచులు ఆడిన ముంబై కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టతరంగా మారిపోయాయి. పాయింట్ల పట్టికలో టాప్ 3 లో ఉన్న మూడు జట్లు ఇప్పటికే 10 పాయింట్లతో ఉండగా అందులో రాజస్థాన్ 14 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉంది.
కాగా 4,5,6 స్థానాల్లో ఉన్న జట్లు 8 పాయింట్లతో ఉండగా వీటిలో ఒక్క జట్టుకే నాలుగో స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముంబై జట్టు ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే.. తమ తదుపరి 6 మ్యాచుల్లోనూ తప్పక గెలవాల్సిందే. అప్పటికి కూడా మిగిలిన జట్లు గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా గతంలో కూడా ముంబై జట్టు ఇలానే వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయి.. తదుపరి అన్ని మ్యాచుల్లో గెలిచి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇలాంటి ఫామ్ పైనే ముంబై అభిమానులు ప్రస్తుతం ఆశలు పెట్టుకున్నారు. మరీ ఈ సీజన్ లో ముంబై తమ అభిమానులను మరోసారి అలరిస్తుందా.. లేక నిరుస్తాహ పరుస్తుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.