ఈ రోజు రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్

by Mahesh |
ఈ రోజు రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య 41 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు లైవ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ కు ముందు సన్‌రైజర్స్ ఆర్సీబీతో చిన్నస్వామి స్టేడియంలో తలపడి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక (287)పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచులో ఆర్సీబీ కూడా 264 పరుగులు చేసి చివరి వరకు పోరాటం సాగించింది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ జట్టు.. బౌలింగ్ వీక్ గా ఉన్న ఆర్సీబీ జట్టుపై 300 స్కోర్ చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. సొంత గ్రౌండ్‌లో సన్ రైజర్స్ కు తిరుగు లేదు. అయితే గత మ్యాచులో చిత్తుగా ఓడిన ఆర్సీబీ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలని చూస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ విజయాలకు బ్రేక్ వేసి.. జోరును తగ్గించి.. విజయంతో తాము రేస్ లో నిలవాలని ఆర్సీబీ భావిస్తోంది. మరీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే రాత్రి మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే మరి.

ఉప్పల్ మ్యాచ్ కు సర్వసిద్ధం..

ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ జట్టుకు అభిమానుల నుంచి ఊహించని రీతిలో సపోర్ట్ పెరిగింది. ఆడిన ప్రతి మ్యాచులో 200 కంటే ఎక్కువ పరుగుల పడుతుండటంతో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచులకు సంబంధించిన టికెట్లు మొత్తం అమ్ముడు పోయాయి. దీనికి తోడు కోహ్లీ జట్టు కావడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో గ్రౌండ్ నిర్వాహకులతో పాటు పోలీసులు ఈ మ్యాచ్ కోసం పకడ్బందిగా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు కూడా భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయగా.. క్రికెట్ అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అలాగే హైదరాబాద్ మెట్రో కూడా ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచ్ ప్రారంభానికి ముందు, అలాగే ముగిసే సమయానికి మెట్రో సర్వీస్‌లను పెంచింది. అలాగే అర్ధరాత్రి వరకు ఈ మెట్రో సర్వీస్ లను పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed