- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRH Vs RCB: ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు హాజరైన ప్రత్యేక అతిథి.. హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్, ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టు బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్ ట్రావీస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగుల చేసి ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇక హెన్రిచ్ క్లానెస్ (67), అబ్దుల్ సమద్ (37), అభిషేక్ శర్మ (34) మార్క్‌రమ్ (32) పగురులు చేయడంతో ఏపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డును హైదరాబాద్ మరోసారి తిరగరాసింది. గత నెల 27న ఉప్పల్ స్టేడయం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుపై 277 స్కోరుతో అత్యధిక పరుగులు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై సోమవారం 287 పరుగులు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ప్రపంచంలో టీ20 చరిత్రలో ఏ ఫ్రాంచైజీ చేయని స్కోర్‌ను నమోదు చేసి సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది.
ఈ క్రమంలోనే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు వీరవిహారం చేస్తుండగా.. ఆకాశంలో ఓ గద్ద స్టేడియం చుట్టూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. అది చూసిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ కరెక్ట్ టైంలో ఈగల్ ఎంట్రీ ఇచ్చిందంటూ ఫుల్ ఖుష్ అయ్యారు. ఎందుకంటే సన్ రైజర్స్ జట్టు లోగోలో ఈగల్ గుర్తు మెయిన్ సింబల్ కావడంతో.. అది కూడా అప్పుడే అక్కడికి రావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓ సెంటిమెంట్‌లా ఫీల్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.