IPL 2024 : గుజరాత్‌కు భారీ షాక్.. రెండు వారాలపాటు స్టార్ బ్యాటర్ దూరం

by Harish |
IPL 2024 : గుజరాత్‌కు భారీ షాక్.. రెండు వారాలపాటు స్టార్ బ్యాటర్ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. ఈ క్రమంలోనే గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతని స్థానంలో కేన్ విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా మిల్లర్ రెండు వారాలపాటు జట్టుకు దూరం కానున్నట్టు తెలుస్తోంది.

పంజాబ్‌తో మ్యాచ్‌ మధ్యలో విలియమ్సన్ మాట్లాడుతూ.. వారం లేదా రెండు వారాలపాటు మిల్లర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని తెలిపాడు. అయితే, మిల్లర్ గాయం తీవ్రతపై ఫ్రాంచైజీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మిడిలార్డర్‌లో అతని లోటును పూడ్చడం జట్టుకు కష్టమే. కాగా, పంజాబ్‌ చేతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఒక దశలో గుజరాత్ విజయం ఖాయమే అనిపించినా.. శశాంక్ సింగ్ రెచ్చిపోవడంతో మ్యాచ్ పంజాబ్‌ వైపు తిరిగింది. గుజరాత్ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం లక్నోతో తలపడనుంది.

Advertisement

Next Story