- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రోహిత్.. ఆ రెండు జరిగాకే తప్పుకుంటానంటు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వయస్సు ఎక్కువ అవుతుండటం, ప్రస్తుతం డజన్ల సంఖ్యలో యువ ప్లేయర్లు అందుబాటులో ఉండటం తో రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. అయితే సీనియర్లు, మాజీ క్రికెటర్లు మాత్రం.. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో ఇద్దరు ఉండాలని, వారి సారథ్యంలోని భారత్ కప్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ భారీ షాట్లతో తన సత్తా చాటుతున్న రోహిత్ శర్మ తన హెటర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. రోహిత్ నిన్నటి మ్యాచ్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన అసలు లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం నేను బాగానే ఆడుతున్నానని అనుకుంటున్నా.. ఇలాగే మరికొన్ని సంవత్సరాలు జట్టులోనే కొనసాగుతా.. టీ20 వరల్డ్ కప్‌తో పాటు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2025) లో భారత్ తరఫున కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌కు టెస్ట్ ఛాంపియన షిన్ సాధించాలి. అలాగే మరో మూడు వరల్డ్ కప్ లు కూడా భారత్ కు సాధించాలి. ఇవి నెరవేరిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.