- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RCBvsCSK: ఐపీఎల్‌లో ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14లో భాగంగా నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లేది నువ్వా? నేనా అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. బెంగళూరులోని చినస్వామి మైదానం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటికే మూడు జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం చెన్నై, ఆర్సీబీ జట్లు ఫైట్ చేయబోతున్నాయి. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన చెన్నై ఏడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో బెంగళూరు కంటే మెరుగైన స్థానంలో ఉంది. బెంగళూరు 13 మ్యాచులు ఆడి కేవలం 6 మ్యాచుల్లోనే గెలుపొంది 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు వెళ్లడం ఖాయం. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. ఈ మ్యాచ్‌లో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి.. లేదా 18 కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలవాలి. ఇలాగైతేనే టాప్ 4లో ఆర్సీబీ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యా్క్స్‌వెల్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.