- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీమ్ ఇండియాకు ఆడే ప్లేయర్ తిలక్.. రవిశాస్త్రి
న్యూఢిల్లీ : ఐపీఎల్-16లో సత్తా చాటుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. తాజా ఇంటర్వ్యూలో రవిశాస్త్రి తిలక్ వర్మ గురించి మాట్లాడుతూ.. అతను త్వరలోనే టీమ్ ఇండియాకు ఆడతాడని జోస్యం చెప్పాడు. ‘తిలక్ ఒక స్టాండౌట్ ప్లేయర్. రెండో మ్యాచో, మూడో మ్యాచ్‌లోనే ఈ విషయం చెప్పా. అతను త్వరలోనే టీమ్ ఇండియాకు ఆడతాడు. మ్యాచ్‌ను ముగించే సత్తా అతనికి ఉంది. తిలక్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు చాలా క్లారిటీగా ఆడతాడు.
అతను ఆడే తొలి పది బంతులకు ప్రతిసారి నేను ఇంప్రెస్ అవుతుంటా. షాట్లు ఆడటానికి ఏమాత్రం వెనుకాడడు. తన బలంపై పూర్తి నమ్మకంగా ఉంటాడు’ అని తెలిపాడు. ఎంత గొప్ప బౌలర్ అయినా తిలక్ లెక్కచేయడని, ఎందుకంటే అతను బౌలర్‌ని కాకుండా బంతిని ఎదుర్కొంటాడని తిలక్ బ్యాటింగ్ శైలిని కొనియాడాడు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 53.50 సగటుతో 214 పరుగులు చేసిన తిలక్. ముంబై జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.