- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్..
దిశ, వెబ్‌డెస్క్: నా స్ట్రైక్‌రేట్ బాగుందా అంటూ విమర్శకులకు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు శిఖర్ ధావన్. ఆదివారం సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 99 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన విషయం తెలిసిందే. ధావన్.. 10 వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోహిత్ రాఠీ తో కలిసి పంజాబ్ స్కోరును 140 మార్క్ దాటించాడు. 66 బంతుల్లో 12 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసిన ధావన్.. ఆ తర్వాత 44 పరుగులు చేయడానికి 24 పరుగులే తీసుకున్నాడు. నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్‌ల బౌలింగ్‌లో వీరబాదుడు బాదాడు.
అయితే మిగతా పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌కు ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మాటల్లో నవ్వుకుంటూనే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు. అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మాత్రం ధావన్ కే దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన అతడు.. తనను విమర్శిస్తున్న వారికి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. ఇన్నాళ్లూ తన స్ట్రైక్ రేట్ పై విమర్శలు చేస్తున్న వారిపై ధావన్ స్పందించాడు. "మీరేదో ట్వీట్ చేసినట్లున్నారు కదా. నా స్ట్రైక్ రేట్ ఇప్పుడు బాగుందా? నేను గూగ్లీస్ కూడా వేయగలను" అని ధావన్ అనడం విశేషం.