ఆ బ్యాటర్ అంటే గంభీర్‌కు భయమట.. గౌతీని అంతలా భయపెట్టిన బ్యాటర్ ఎవరంటే?

by Harish |
ఆ బ్యాటర్ అంటే గంభీర్‌కు భయమట.. గౌతీని అంతలా భయపెట్టిన బ్యాటర్ ఎవరంటే?
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఆ జట్టు మెంటార్‌ గౌతమ్ గంభీర్‌కు ఓ బ్యాటర్ అంటే భయమట. అతని వల్ల నిద్రలేని రాత్రులు కూడా గడిపాడట. ఈ విషయాన్ని గంభీరే స్వయంగా చెప్పాడు. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరో కాదు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో గంభీర్ మాట్లాడుతూ..‘కెప్టెన్‌గా నా ఐపీఎల్ కెరీర్‌లో ఒక ఆటగాడి వల్ల నిద్రలేని రాత్రులు గడిపా. నన్ను భయపెట్టింది క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు. ఐపీఎల్‌లో నేను భయపడే ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. మైదానంలో నేను ప్లాన్ ఏ, ప్లాన్ బితోపాటు ప్లాన్ సిని కూడా సిద్ధం చేసుకుంటా. కానీ, రోహిత్‌ క్రీజ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరివల్లా కాదు. ఇతర బ్యాటర్ల కోసం నేనెప్పుడు ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏతోనే వారిని కట్టడి చేయొచ్చని నాకు విజువల్స్‌లో కనిపిస్తుంది. కానీ, రోహిత్ విషయంలో అది వర్కౌట్ అవదు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటా. ఒక ప్లాన్ పనిచేయకపోతే.. మరో ప్లాన్ అమలు చేయాలని అనుకుంటా.’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా, గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా రెండుసార్లు(2012, 2014) ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed