ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన మార్కస్ స్టోయినిస్

by Mahesh |
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన మార్కస్ స్టోయినిస్
X

దిశ, వెబ్‌డెస్క్: 17వ ఐపీఎల్ సీజన్ సంచలన రికార్డులకు కేంద్రంగా మారింది. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగానే సాగుతూంది. చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య గెలుపోటములు దోబుచులాడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్ లో 200 కంటే ఎక్కువ పరుగులను ఈజీగా చేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక రికార్డులు బ్రేక్ కావడంతో పాటు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం చెన్నై, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ మార్స్ స్టోయినిస్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచులో సీఎస్‌కే నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని చేదించిన లక్నో జట్టు ఊహించని విజయం సాధించింది.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్కస్ స్టోయినిస్.. 124 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో వరుస వికెట్లు కోల్పోయిన లక్నో జట్టుకు అండగా నిలిచిన స్టోయినిస్ 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు చివరి ఓవర్లో 6 బంతులకు 17 పరుగుల అవసరం ఉండగా వాటిని కేవలం 3 బంతులోనే కొట్టి జట్టుకు విజయం అందించాడు. ఇదిలా ఉండగా 124 పరుగులతో అజేయంగా నిలిచి స్టోయినిస్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వ్యక్తిగా అతను నిలిచిపోయాడు. గతంలో పాల్ వాల్ తాటి 120* సెహ్వాగ్ 119, శాంసన్ 119, షేన్ వాట్సన్ 117* తరువాతి స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed