ఆర్సీబీని అమ్మేయండి.. బీసీసీఐకి రిక్వెస్ట్

by Harish |
ఆర్సీబీని అమ్మేయండి.. బీసీసీఐకి రిక్వెస్ట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస పరాజయాలతో సతమతమవుతున్నది. మంగళవారం హైదరాబాద్ చేతిలో ఓటమితో ఈ సీజన్‌లో 6వ పరాజయాన్ని పొంది ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. బెంగళూరు జట్టు ప్రదర్శన పట్ల భారత మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి అసహనం వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ చేతిలో ఓటమి అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన అతను.. ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మేయాలంటూ మండిపడ్డాడు. ‘ఐపీఎల్, అభిమానులు, ఆటగాళ్ల కోసం బీసీసీఐ ఆర్సీబీని కొత్త యజమానికి అమ్మేయాలి. ఇతర జట్లలాగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి ఆర్సీబీని అప్పగించండి. జట్టు ప్రదర్శన బాధాకరం’ అని ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో బెంగళూరు ఆరు ఓటములు, ఒక్క విజయంతో అట్టడుగు స్థానంలో ఉన్నది. ఈ నెల 21న కోల్‌కతాను ఈ సీజన్‌లో రెండోసారి ఎదుర్కొనుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో బెంగళూరు ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story