IPL2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కోల్‌కతా విజయం

by GSrikanth |
IPL2024: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కోల్‌కతా విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్సీబీ ఖాతాలో మరో ఓటమి చేరింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు సమష్టిగా రాణించి భారీ స్కోరు చేశారు. శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్‌ సెంచరీ‌తో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఫిలిప్ సాల్ట్ (48), ఆండ్రి రస్సెల్ (27 నాటౌట్), రమణ్‌దీప్ (24 నాటౌట్), రింకు సింగ్ (24) క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించారు.

దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ 2, కామెరూన్ గ్రీన్ 2.. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు. అనంతరం 223 లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు జాక్స్ (55), పటీదార్ (52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.

Advertisement

Next Story