KKR Vs SRH: కీలక మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరేదెవరో..! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

by Shiva |
KKR Vs SRH: కీలక మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరేదెవరో..! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 సీజన్ చరమాంకానికి చేరుకుంది. పాయింట్స్ టేబుల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఇవాళ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు తలపడబోతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన సన్‌ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్ ఎన్నడూ లేని విధంగా టేబుల్ టాపర్‌గా నిలిచింది. కోల్‌కతా జట్టులో ఆల్‌రౌండర్ సునీల్ నారాయణ్ అదరగొడుతున్నాడు. అటు ఒపెనర్‌గా వస్తూ భారీగా పరుగులు సాధిస్తూనే.. బౌలింగ్‌లోనే సత్తా చాటుతున్నాడు. ఇక అండ్రూ రస్సెల్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్‌లు కూడా బాధ్యతాయుతంగా ఆడుతున్నారు.

ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. పేసర్లు మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థి జట్టును పవర్ ప్లేలో కట్టడి చేయలేకపోయినా.. మిగతా ఓవర్లలో పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నారు. ఇక పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో విధ్వంసాన్నే సృష్టిస్తున్నారు. ఇక మిడిలార్డర్‌లో మార్క్‌రమ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వికెట్లు కోల్పోయినా చక్కగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. చివర్లో వస్తున్న షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్‌లు భారీ షాట్లు ఆడుతూ.. జట్టు భారీ స్కోర్ చేసేలా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే, మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌‌లో అడుగుపెట్టనుండటంతో ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

తుది జట్లు ఇలా..

సన్‌ రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (W.K), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్.

ఇంపాక్ట్ సబ్స్: సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనద్కత్.

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(W.K), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(C), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ సబ్స్: అనుకుల్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, KS భరత్, షెర్ఫైన్ రూథర్‌ఫోర్డ్.

Advertisement

Next Story

Most Viewed