- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీమ్ ఇండియాకు భారీ షాక్.. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టార్ బ్యాటర్ ఔట్
లక్నో: ఐపీఎల్‌లో ఇటీవల గాయపడిన టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జూన్‌లో జరగబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌తోపాటు ఐపీఎల్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం రాహుల్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించాడు. తొడ గాయానికి సర్జరీ తప్పనిసరి కావడంతో ఐపీఎల్‌తోపాటు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమవుతున్నట్టు స్పష్టతనిచ్చాడు. ‘త్వరలోనే శస్త్రచికిత్స చేయించుకుంటాను. వచ్చే రోజుల్లో నేను పూర్తిగా కోలుకోవడంపైనే ఫోకస్ పెట్టబోతున్నా. లక్నో కెప్టెన్‌గా కీలక సమయంలో నేను జట్టుతో లేకపోవడం చాలా బాధిస్తుంది.
కానీ, లక్నో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని నమ్ముతున్నాను. వచ్చే నెలలో ఓవల్‌కు టీమ్ ఇండియాతో కలిసి వెళ్లలేను. నేను మళ్లీ తిరిగి వచ్చేందుకు ఏం చేయాలో అన్ని చేస్తాను’ అని రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. లక్నో టీమ్ మేనేజ్‌మెంట్ కూడా రాహుల్ ఐపీఎల్ నుంచి వైదొలిగినట్టు ధ్రువీకరించింది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రాహుల్ స్థానం భర్తీపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది.