హైదరాబాద్‌ వ్యాప్తంగా ఐపీఎల్ సందడి ప్రారంభం

by GSrikanth |
హైదరాబాద్‌ వ్యాప్తంగా ఐపీఎల్ సందడి ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి షురూ అయింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియం చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం టీఎస్‌ఆర్టీసీ ఉప్పల్‌కు అదనంగా బస్సులు నడుపుతోంది. అదేవిధంగా నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో అదనంగా రైళ్లు నడుపుతున్నది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.

ప్రతి రెండు, మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలు ఉప్పల్ వైపు పరుగులు తీస్తుందని పేర్కొంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఆర్టీసీతో పాటు మెట్రో కూడా మరిన్ని సర్వీసులను నడుపనున్నాయి. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు. ఉప్పల్‌ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు, ముగిసిన తర్వాత సికింద్రాబాద్‌, హబ్సిగూడ, తార్నాక, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, అంబర్‌పేట, రామంతపూర్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ ఎరీనా, ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్, కేవీ-1 స్కూల్‌, వరంగల్‌ హైవే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed