IPL 2023: వివదానికి తెర.. చేతులు కలిపిన గంగూలీ-కోహ్లీ!

by Vinod kumar |
IPL 2023: వివదానికి తెర.. చేతులు కలిపిన గంగూలీ-కోహ్లీ!
X

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో గంగూలీ, కోహ్లీ వ్యవహరించిన తీరుతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గంగూలీ, కోహ్లీ ఒకరినొకరు కోపంగా చూసుకోవడం, మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కోహ్లీని దాదా దాటేసి వెళ్లాడు.

అయితే, విభేదాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని ఇద్దరు భావించినట్టు ఉన్నారు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ అనంతరం గంగూలీ, కోహ్లీ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. దాదా కోహ్లీ భుజాన్ని తట్టారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదా, కోహ్లీ వివాదానికి శుభం కార్డు పడటంతో క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 7 వికెట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed