- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: లక్నోకు బిగ్ షాక్.. మేలో స్వదేశానికి కీలక ప్లేయర్!
లక్నో: ఐపీఎల్ లీగ్ చివరి మ్యాచ్‌ల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఇంగ్లాండ్‌కు చెందిన మార్క్‌వుడ్ త్వరలోనే స్వదేశానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ‘మార్క్‌వుడ్, సారా దంపతులు మే చివర్లో రెండు సంతానానికి జన్మనివ్వనున్నట్టు సమాచారం. ఆ సమయంలో భార్య దగ్గర ఉండేందుకు వుడ్ ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు’ అని ప్రముఖ క్రీడా వైబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం లక్నో జట్టులో మార్క్‌వుడ్ కీలక బౌలర్‌గా ఉన్నాడు.
ఇప్పటివరకు అతను 4 మ్యాచ్‌లు ఆడగా.. 11 వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అయితే, అనారోగ్యం కారణంగా అతను గత రెండు మ్యాచ్‌లు అందుబాటులో లేడు. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న లక్నోకు భవిష్యత్తు మ్యాచ్‌లు కీలకం కానున్నాయి.లీగ్ చివర్లో మార్క్‌వుడ్ జట్టుకు దూరం కావడం లక్నోకు భారీ దెబ్బే అని చెప్పుకోవచ్చు.