- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: లక్నో జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ ఔట్
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌ను ఆడాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ వైదొలిగాడు. ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. నెట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో అతను గాయపడ్డాడు. ఉనద్కత్ ఎడమ భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో జయదేవ్ ఉనద్కత్ తప్పుకొన్న విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో అతను కిందపడ్డాడు. ఎడమ పాదం నెట్ తాడులో చిక్కుకోవడంతో బ్యాలెన్స్ తప్పాడు. అతని ఎడమ భుజం నేరుగా భూమిని తాకింది.
వైద్యులు దీన్ని పరిశీలించిన తరువాత ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌కు ఉనద్కత్ అందుబాటులో ఉండట్లేదని ప్రకటించింది. అయితే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నాటికి కోలుకుంటాడని బీసీసీఐ చెబుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే టెస్ట్ జట్టు కోసం ఉనద్కత్ కూడా ఎంపికైన విషయం తెలిసిందే. లండన్‌కు బయలుదేరి వెళ్లడానికి ముందే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటాడని బీసీసీఐ తెలిపింది.
See you back on the field soon @JDUnadkat
— IndianPremierLeague (@IPL) May 1, 2023
Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN