- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్.. కీలక బ్యాటర్ ఔట్
by Vinod kumar |
X
కోల్‌కతా: ఐపీఎల్-16లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్, బంగ్లాదేశ్‌కు చెందిన లిటాన్ దాస్ నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే మ్యాచ్‌తోపాటు లీగ్‌లో పలు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ జట్టు వర్గాలు తెలిపాయి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతను బంగ్లాకు వెళ్లినట్టు పేర్కొన్నాయి. అయితే, అతను తిరిగి రావడంపై స్పష్టతను ఇవ్వలేదు. మేలో ఐర్లాండ్‌తో బంగ్లా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ నేపథ్యంలో అతని రాకపై సందిగ్ధం నెలకొంది. మినీ వేలంలో కోల్‌కతా ఫ్రాంచైజీ అతన్ని రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఈ సీజన్‌లో అతను ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. లీగ్ దశలో కేకేఆర్ 8 మ్యాచ్‌లు ఆడగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో లిటాన్ దాస్‌కు అవకాశం వచ్చినా.. 4 పరుగులకే అవుటై నిరాశపరిచాడు.
Advertisement
Next Story