IPL 2023: రింకు బ్యాట్ సీక్రెట్ చెప్పిన కేకేఆర్ కెప్టెన్..

by Vinod kumar |
IPL 2023: రింకు బ్యాట్ సీక్రెట్ చెప్పిన కేకేఆర్ కెప్టెన్..
X

అహ్మదాబాద్: గుజరాత్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ బ్యాటు గురించి కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణా సీక్రెట్ బయటపెట్టాడు. గుజరాత్‌కు చెమటలు పట్టించిన ఆ బ్యాటు రింక్ సింగ్‌ది కాదని, ఆ బ్యాటు తనదేనని నితీశ్ రాణా తెలిపాడు. ఈ వీడియోను కేకేఆర్ తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పోస్టు చేసింది. ‘ఈ సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను ఈ బ్యాటుతోనే ఆడాను. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతోపాటు గతేడాది ఐపీఎల్‌లో కూడా పలు మ్యాచ్‌ల్లో ఆడా. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు రింకు సింగ్ ఈ బ్యాట్‌ను కావాలని అడిగాడు.

అతనికి ఇవ్వాలని నాకు లేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి ఎవరో అతనికి ఇచ్చారు. గుజరాత్‌ మీద ఆ బ్యాటుతో అదరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి, ఇకనుంచి ఆ బ్యాటు అతనిదే. దాన్నిని నేను తిరిగి తీసుకోను’ అని రాణా వివరించాడు.

Advertisement

Next Story